అందని బ్యాంకు రుణాలు | - | Sakshi
Sakshi News home page

అందని బ్యాంకు రుణాలు

Jul 7 2025 6:11 AM | Updated on Jul 7 2025 6:11 AM

అందని

అందని బ్యాంకు రుణాలు

ఆసిఫాబాద్‌: మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా స్వయం సహా యక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా సంఘాల కు అవసరాల మేరకు తక్కువ వడ్డీకి బ్యాంకు లింకేజీతో రుణాలు అందజేస్తోంది. కానీ ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహా యక సంఘాలకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా జూన్‌లో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తారు. జిల్లాలో 6,295 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ ఏడాది 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.232.44 కోట్లు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణలక్ష్యం పెంచారు. ఒక్కో గ్రూప్‌లో 15 మంది సభ్యులు ఉండగా గ్రూప్‌కు రూ.15 లక్షల వరకు రుణాలు పంపిణీ చేస్తున్నారు. తీసుకున్న రుణాలను ప్రతీ నెల విడతల వారీగా చెల్లిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో కానరాని వివరాలు

జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌ గతంలో గ్రామ పంచాయతీ ఉండగా రెండేళ్లక్రితం మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో 12 మంది వీవోలు, 12 గ్రామ సంఘాలు, 271 స్వయం సహాయక సంఘాలు, 2,730 మంది సభ్యులు ఉన్నారు. వారంతా కొన్ని సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆరు మాసాలుగా ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్‌లైన్‌లో సెర్ఫ్‌, మెప్మా జాబితాలో చూపడంలేదు. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలకోసం ఇబ్బందులకు గురవుతున్నారు.

రుణాలకోసం నిరీక్షణ

ఆరు మాసాలుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకోసం నిరీక్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గ్రూపుల వివరాలు కనిపించక పోవడంతో గతనెల 30న ఆర్‌పీలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సెర్ఫ్‌, మెప్మా జాబితా లో సభ్యుల వివరాలు కనిపించక పోవడంతో వ్యవసాయ రుణాలకోసం సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్యాంకు రుణం అందించాలి

ఉపాధికోసం ఏటా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నా. ఆన్‌లైన్‌లో జాబి తా కనిపించడంలేదని ఈ ఏడాది ఇప్పటి వరకు రు ణాలు ఇవ్వలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్యాంకు రుణం అందించి ఆదుకోవాలి.

– జుల్లూరి శోభ, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్‌

సమస్య పరిష్కరిస్తాం

సాంకేతిక కారణాల వల్ల ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్‌లైన్‌లో రావడం లేదు. త్వరలో సమస్య పరిష్కరించి, రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.– రామకృష్ణ, డీఆర్‌డీఏ అదనపు పీడీ

పోర్టల్‌లో కానరాని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ సంఘాల వివరాలు

ఆరు మాసాలుగా సభ్యుల నిరీక్షణ

అందని బ్యాంకు రుణాలు1
1/1

అందని బ్యాంకు రుణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement