మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్‌ వైద్యమే! | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్‌ వైద్యమే!

Jul 7 2025 6:10 AM | Updated on Jul 7 2025 6:10 AM

మధ్యా

మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్‌ వైద్యమే!

● రిమ్స్‌లో కొందరు సీనియర్‌ వైద్యుల తీరు ● జూడాలు వాట్సాప్‌ చేస్తే చికిత్సను వివరిస్తున్న వైనం ● అత్యవసర వైద్యం అందక రోగుల ఇక్కట్లు ● ఇటీవల ఓ వైద్యుడిపై ఆదిలాబాద్‌ కలెక్టర్‌ చర్యలు

దిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షిషా ఇటీవల మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రిమ్స్‌లో తనిఖీ చేపట్టారు. ఆ వార్డులో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేడు. దీంతో కలెక్టర్‌ సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. జనరల్‌ సర్జరీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు సంబంధించిన ఏడు రోజుల వేతనంలో కోత విధించారు. ఆర్‌ఎంవోగా పనిచేసే ఓ వైద్యురాలిని విధుల నుంచి తప్పించాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం.

నెల 4న మావల మండలంలోని శంకర్‌గుట్టకు చెందిన లక్ష్మణ్‌ కాలుకు గాయం కావడంతో కుటుంబీకులు రిమ్స్‌కు తీసుకొచ్చారు. వైద్యులు దాదాపు గంటకు పైగా వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత జూనియర్‌ డాక్టర్‌ వచ్చి కాలు గాయం ఫొటో తీసి సీనియర్‌ వైద్యులకు పంపినట్లు బాధితుడి కుటుంబీకులు తెలిపారు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో రక్తస్రావం కావడంతో ఆయన మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబీకులు టూటౌన్‌లో వైద్యులపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

ఆదిలాబాద్‌టౌన్‌: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో పనిచేస్తున్న కొందరు వైద్యుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు. ఇక్కడ విధులు నిర్వహించడం కంటే ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పైనే మక్కువ చూపుతున్నారు. కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు హెచ్చరించినా పెడచెడిన పెడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నమే ఇంటిముఖం పడుతున్నారు. అత్యవసరమైతే జూనియర్‌ డాక్టర్ల ద్వారా వాట్సాప్‌ వైద్యం అందిస్తునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో వైద్యం అందక పలువురు రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. రిమ్స్‌లో పనిచేసే చాలా మంది వైద్యులు జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జూనియర్‌ వైద్యులతోనే..

జిల్లాకు పెద్ద దిక్కయిన రిమ్స్‌ ఆస్పత్రిలో నాణ్యమై న వైద్యం గగనంగా మారింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పేదలు వైద్యం కోసం రి మ్స్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారు. రిమ్స్‌లో సీనియర్‌ వైద్యులు కొందరు తరచూ విధులకు ఎగనామం పెడుతున్నారు. రూ.లక్షల్లో వేతనం తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారని పలువురు పేర్కొంటున్నా రు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నా కొంతమంది మాత్రమే సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుండగా, మిగతా వైద్యుల జాడ లేకుండా పోతుంది. మెడికో లు, జూనియర్‌ వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్లు, పీజీ వైద్యులే రోగులకు దిక్కవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జూనియర్‌ వైద్యులు సీనియర్‌ వై ద్యులకు వాట్సాప్‌ ద్వారా కేషీట్‌, రిపోర్టులు పంపి వైద్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వారు వాట్సాప్‌లో చికిత్స గురించి తెలియజేస్తే ఆ ప్రకా రం రోగికి అందిస్తున్నా రు. రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఫోన్‌ చేస్తే వచ్చి వైద్యం అందించి ఇంటిముఖం పడుతున్నారు.

రిమ్స్‌ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులు

మారని తీరు..

రిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది వైద్యుల తీరులో మార్పు కానరావడం లేదు. ఒకప్పుడు వైద్యు ల కొరత ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి చూస్తే అత్యవసర విభాగాలైన ఎస్‌ఎన్‌సీయూ, ఎంఐసీ యూ, మెటర్నటి, ఇతర వార్డుల్లో డాక్టర్లు కని పించకుండా పోతున్నారు. ఆ సమయంలో జూనియర్‌ వైద్యులు సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం పూట హాజరు కోసమే వస్తున్నారనే విధంగా మారింది. ప్రతిరోజు రిమ్స్‌ డైరెక్టర్‌తో పాటు అప్పుడప్పుడు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా డుమ్మా వైద్యుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.

వైద్యులు అందుబాటులో ఉంటున్నారు..

రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపడుతున్నాం.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్‌ వైద్యమే!1
1/1

మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్‌ వైద్యమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement