
యువవిలాపం
తిర్యాణి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు నెలల క్రితం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు వివిధ రకా ల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూ డిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ. 50 వేల యూనిట్‌కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్‌కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లాలో 29,756 దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో వివిధ వ ర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికకోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖారా రు చేశారు. దీంతో పాటుగా అధికారులు దరఖాస్తుదారులకు సంబంధింత బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. దీంతో లబ్ధి దారుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభిస్తామని ప్ర భుత్వం ప్రకటన చేసింది. కానీ నేటికీ పథకం అమలుకు నోచుకోలేదు. నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి యువ వికాసం అమలుపై ఎలాంటి సృష్టత రాకపోవడంతో దరఖాస్తుదారుల్లో త్రీవ అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా? లేదా అని నిరుద్యోగులు ఆందోళ న చెందుతున్నారు. కాగా పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే సమాచారం కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికా రి, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
మండలం దరఖాస్తుదారులు
ఆసిఫాబాద్ 3040
బెజ్జూర్ 1788
చింతలమానెపెల్లి 1907
దహెగాం 1622
జైనూర్ 1860
కాగజ్‌నగర్ 5486
కెరమెరి 1761
కౌటాల 2327
లింగాపూర్ 793
పెంచికల్‌పేట్ 1072
రెబ్బెన 2827
సిర్పూర్(టి) 1616
సిర్పూర్(యూ) 893
తిర్యాణి 1690
వాంకిడి 1074
మొత్తం 29,756
ఇంటర్వ్యూలకే పరిమితమైన పథకం
తదుపరి ప్రక్రియలు నిలిపివేత..
దరఖాస్తుదారుల్లో అసంతృప్తి
ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నా
ఇంటర్ పూర్తి చేసిన నేను రాజీవ్ యువ వికాసం పథకంలో ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నా. జూన్ 2 నుంచే రుణాలు ఇస్తామని చెప్పారు. నేటికీ ఇవ్వలేదు. ఎవర్ని అడిగినా వివరాలు చెప్పడంలేదు. లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతా. ప్రస్తుతం ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా.
– మహదేవుని పవన్, గోలేటి, రెబ్బెన
మోసం చేయడం సరికాదు
యువ వికాసం పేరిట రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకుండా దరఖాస్తుదారులను మోసం చేయడం సరికాదు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలి. – ఇగురపు సంజీవ్,
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి

యువవిలాపం

యువవిలాపం