
యూరియా పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలి
వాంకిడి: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు యూరి యా త్వరగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో రెండు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధి కారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికా రులకు సూచించారు. రేషన్ కార్డుల మంజూ రులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏడీఏ జాడి మిలింద్ కుమార్, తహసీల్దార్ కవిత, మండల వ్యవసాయ అధికారి గోపికాంత్, డీటీ రాంలాల్, తదితరులు ఉన్నారు.