
గిరిజనుల అభివృద్ధికి పీఎం జుగా
తిర్యాణి: గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా పథకాన్ని ప్రవేశపెట్టిందని డీటీడీవో రమాదేవి అన్నారు. శనివారం మండలంలోని దంతాన్‌పెల్లిలో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులందరికీ ఆధార్‌కార్డు ఆప్‌డేట్‌తో పాటు నూతన కార్డు మంజురూ, బర్త్ సర్టిఫికెట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీఎం జుగాపై కళాజాత బృందం సభ్యులు నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమావేశంలో ఎంపీడీవో మల్లేశ్, వెటర్నరీ వైద్యుడు సాగర్, ఏపీఎం శ్రీనివాస్, పీఎం జుగా మండల కోఆర్డినేటర్ వెడ్మ యశ్వంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
తిర్యాణి: నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం దంతాన్‌పెల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఏడాదిలో కనీసం రెండు మొక్కలు నాటాలన్నారు. మొక్కలను విరివిరిగా పెంచడం ద్వారానే పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేముల మల్లేశ్, టెక్నికల్ అసిస్టెంట్ వోడిగ సాగర్, పంచాయతీ కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి పీఎం జుగా