
అర్హులందరికీ ‘రైతు భరోసా’
ఆసిఫాబాద్: రాష్ట్రంలో అర్హులందరికీ రైతు భరో సా నగదు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం ఆవరణలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,031 రైతు వేదికల్లో ఏర్పా టు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేశామన్నారు. గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీ ద్వారా 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. ఏడాది కా లంలో సుమారు 60 వేల మంది నిరుద్యోగ యు వతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 18 నెలల కాలంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణమాఫీ, పంట కొనుగోలు, సన్నరకం వడ్లకు బోనస్‌తో మొత్తంగా రూ.1.04 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మహిళల ఆధ్వర్యంలో 1000 నూత న బస్సులు ప్రారంభించామని, 8 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో ని జన్కాపూర్ రైతు కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 44 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, ఏవో మిలింద్, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.