
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఆసిఫాబాద్‌రూరల్: క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్‌ను యువజన క్రీడల అధికారి రమాదేవితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్, కుమురంభీం చౌక్, అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా ఈ రన్ సాగింది. కలెక్టర్ మాట్లాడుతూ వి ద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నా రు. క్రీడాకారులు జిల్లాకు పేరు తేవాలని సూచించారు. డీఎస్‌వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, అథ్లెటిక్ కోచ్ విద్యాసాగర్, పీడీలు, పీఈటీలు రాకేశ్, తిరుపతి, లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. మండలంలోని కొఠారి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాలకు ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందన్నారు. అనంతరం సావర్‌ఖేడా గ్రా మంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు రంగయ్యతోపా టు ఇతర ఉపాధ్యాయుల అంకిత భావాన్ని అభినందించారు. బాగా చదివిన ఒకటో తరగతి విద్యార్థిని మధుప్రియను మెచ్చుకున్నారు. పాఠ్యపుస్తకాలు, వంటకు ఉపయోగించే కూరగాయలను పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ వేణుగోపాల్, ఇన్‌చార్జి డీఈవో ఉదయ్‌బాబు, ఎంఈవో ఆడే ప్రకాశ్, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో అంజద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.