
2న అధికారులకు శిక్షణ
ఆసిఫాబాద్‌అర్బన్: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసం జూలై 2న నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా రూపకల్పన, బూత్ స్థాయి అధికారుల శిక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలన్నారు. ఎక్కువగా ఉంటే సహాయ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ రియాజ్ అలీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.