
సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ సురేశ్‌కుమార్
● ఎస్పీ సురేశ్‌కుమార్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన అవసరమని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిన నేపథ్యంలో సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవడం ముఖ్యమన్నారు. ఒక వ్యక్తి వివిధ కారణాలతో అపస్మారక స్థితిలో ఉలుకుపలుకు లేకుండా ఉంటే ముందుగా అతడిని తట్టి లేపుతూ మెదడును ఉత్తేజితం చేయాలన్నారు. అయినా స్పందించకుంటే నాడి పనిచేస్తుందా.. లేదా..? అని పరీక్షించి, పనిచేయకుంటే అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంబులెన్స్ చేరుకునే వరకు సీపీఆర్ ప్రక్రియ చేపట్టాలన్నారు. సదరు వ్యక్తి చాతిపై నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఒత్తిడి తేవాలన్నారు. ఇలా చేసేటప్పుడు దవడ భాగాన్ని పైకి లేపి ఉంచాలని, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అంది మనిషి బతికేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆపత్కాలంలో పోలీసులు వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. అదనపు ఎస్పీలు అచ్చేశ్వర్‌రావు, భీంరావు, సీపీఆర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ సంతోష్ డాక్టర్లు రాజు, సుజిత్, సిబ్బంది పవన్‌కుమార్, శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.