మిగిలింది | - | Sakshi
Sakshi News home page

మిగిలింది

Mar 29 2023 12:32 AM | Updated on Mar 29 2023 12:32 AM

● కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 53 శాతమే పన్నులు వసూలు ● పేరుకుపోయిన నల్లా బిల్లులు ● ఇప్పటికే రూ.1.5 కోట్ల ఆస్తి పన్ను చెల్లించిన ఎస్పీఎం యాజమాన్యం ● అయినా గడువులోగా వసూళ్లు కష్టమే.. ● పట్టణంలో 30 వార్డులు, 14,180 నివాస గృహాలు

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో వందశాతం ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఒక వైపు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేసి పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 53 శాతం మాత్రమే వసూలైంది. దీంతో గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.

పేరుకుపోయిన నల్లా బిల్లులు

మరో వైపు మున్సిపాలిటీ పరిధిలోని 5,960 మంచి నీటి కుళాయిలు ఉన్నాయి. నల్లా కనెక్షన్ల ద్వారా ము న్సిపాలిటీకి దాదాపు రూ.70 లక్షల బిల్లులు రావా ల్సి ఉంది. అధికారులు 50 శాతం (రూ.35 లక్షలు) వసూలు చేశారు. ప్రతినెలా రూ.100 చొప్పున నల్లా కనెక్షన్‌ వినియోగదారుల నుంచి బిలు వసూలు చే స్తుంటారు. మిగిలిన 50 శాతం నల్లా బిల్లుల వసూళ్ల కోసం కూడా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధ, గురు, శుక్రవారాల్లో వేగంగా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు.

రూ.3.5 కోట్ల లక్ష్యం

కాగజ్‌నగర్‌ బల్దియాలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 కోట్ల ఆస్తి పన్ను వసూలుకు అధికారులు డిమాండ్‌ నోటీసులు అందజేశారు. మంగళవారం సాయంత్రం వరకు 53 శాతం (రూ.కోటి 83 లక్షలు) పన్నులు వసూలు చేశారు. మరో బుధవారం కాకుండా మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, 47 శాతం పన్నులు వసూళ్ల ప్రక్రియ గగనమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శత శాతం పన్నుల వసూళ్ల కోసం మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య ఆధ్వర్యంలో మేనేజర్‌ పెద్దింటి క్రాంతి అధికారులు, సిబ్బందితో కలిసి ఆరుగురు సూపర్‌వైజర్లతో కూడిన ఆరు టీంల సహాయంతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సిర్పూర్‌ పేపర్‌మిల్లు యాజమాన్యం మున్సిపాలిటీకి నెల రోజుల క్రితమే రూ.1.5 కోట్లు ఆస్తి పన్ను రూపంలో చెల్లించింది. మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా, 14,180 నివాస గృహాలు ఉన్నాయి. 832 వాణిజ్య సముదాయాలు, దాదాపు 24 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement