
50మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి తన సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఖమ్మం ఎంపీ రామసహా యం రఘురాంరెడ్డి అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి చెక్కులు పంపిణీ చేశాక మాట్లాడారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి 50 మందికి రూ.11.24లక్షల విలువైన చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసానిచ్చేలా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మున్నేరు ప్రవాహంతో ట్రాఫిక్ మళ్లింపు
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని కాల్వొడ్డు నుంచి నాయుడుపేట వరకు మున్నేరుపై ఉన్న చప్టా పై బుధవారం వరద పెరిగింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేసి ప్రకాష్‌నగర్, కరుణగిరి వంతెన మీదుగా ప్రయాణం సాగించేలా ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ ఆధ్వర్యాన పర్యవేక్షించారు.
రేపు ఫుట్‌బాల్ బాలికల జట్టు ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జూనియర్స్ విభాగంలో ఉమ్మ డి జిల్లా స్థాయి బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికకు ఈనెల 4న ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.ఆదర్శ్‌కుమార్ తెలిపారు. పోటీలకు వచ్చే హాజరయ్యే వారు ఆధార్ కార్డు, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, కిట్‌తో శుక్రవారం 4గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
వృత్తినైపుణ్యంతోనే
విధుల్లో రాణింపు
వరంగల్ క్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం పెంచుకోవడం తప్పనిసరని వరంగల్ పోలీసు కమిషనరేట్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. వరంగల్‌లో మూడు రోజుల పాటు జరగనున్న భద్రాది కొత్తగూడెం జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మీట్‌లో వరంగల్, ఖమ్మం కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాది జిల్లాల పోలీసులు పాల్గొంటున్నారని తెలిపారు. కేసుల విచారణ, శాసీ్త్రయంగా సాక్ష్యాల సేకరణకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ పరిధిలోని పోలీసు అధికారులు పలువురు పాల్గొన్నారు.