
బ్లీచింగ్‌కూ నిధులు ఇవ్వని ప్రభుత్వం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మధు
నేలకొండపల్లి: రాష్టంలో కొందరు మీడియా ముసుగులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ఈ విషప్రచారం వెనక సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీతాతా మధుసూధన్ ఆరోపించారు. ఇలాంటి వారు తీరు మార్చుకోకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు. నేలకొండపల్లిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. గ్రామపంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు రాకపోవడం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి లేక కార్యదర్శులు సెలవులో వెళ్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు తప్ప కాంగ్రెస్ హయాంలో కాల్వలో తట్ట మట్టి కూడా తీయలేదని పేర్కొన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ ప్రభావం కనపడుతుందని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య, నాయకులు కోటి సైదారెడ్డి, నంబూరి సత్యనారాయణ, మరికంటి రేణుబాబు, తన్నీరు సత్యనారాయణ, కమదన ప్రవీణ్, మాదాసు ఆదాం, సొడేపొంగు ప్రశాంత్, అనగాని నర్సింహారావు, యలమంద, ఉదయ్, నాగేంద్రబాబు పాల్గొన్నారు.