
పటేల్ స్టేడియం కళకళ
● కొనసాగుతున్న వేసవి క్రీడా శిబిరాలు ● ఈత, ఇతర క్రీడల్లో శిక్షణకు ఔత్సాహికుల బారులు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియం ఉదయం, సాయంత్రం ఔత్సాహిక క్రీడాకారులతో కళకళలాడుతోంది. స్విమ్మింగ్ సహా పలు క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా పిల్లలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో శిక్షణ సమయాల్లో మార్పులు చేసి బ్యాచ్‌ల వారీగా విభజించారు. గతంతో పోలిస్తే ఎక్కువగా క్రీడాకారులు వస్తుండడంతో కోచ్‌లు కూడా ఉత్సాహంగా తర్ఫీదు ఇస్తున్నారు. స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ అంశాల్లో ఎక్కువ మంది హాజరవుతున్నారు. ఇందులో స్విమ్మింగ్‌కై తే మరింత మంది వస్తుండడంతో బ్యాచ్‌లుగా విభజించినా అందరికీ శిక్షణ ఇవ్వడం సాధ్యం కావడం లేదని కోచ్‌లు చెబుతున్నారు. అయితే, వేసవి సెలవులకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా హాజరైతేనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటడం వీలవుతుందని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇబ్బంది లేకుండా శిక్షణ
స్టేడియంలో వేసవి శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అన్ని క్రీడాంశాల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశాం. ఔత్సాహికులు ఎక్కువగా వస్తుండడంతో రద్దీ నెలకొంటోంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం.
– టి.సునీల్‌రెడ్డి, డీవైఎస్‌ఓ

పటేల్ స్టేడియం కళకళ

పటేల్ స్టేడియం కళకళ