
సీబీఎస్‌ఈ ఫలితాల్లో ‘నవోదయ’ విద్యార్థుల ప్రతిభ
కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయ విద్యార్థులు ఇటీవల వెల్లడైన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. వివరాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. ప్లస్ టూ (12వ తరగతి) పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరుకాగా వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని, ఇందులో 34 మంది డిస్టింక్షన్‌లో, 14 మంది మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. కాగా, 575 మార్కులతో రాఘవేంద్ర, 566 మార్కులతో నిఖిల్ టాపర్లుగా నిలిచారని తెలిపారు. అలాగే, పదో తరగతి ఫలితాల్లో 79 మందికి వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 65 మంది డిస్టింక్షన్‌లో, 12 మంది ప్రథమ శ్రేణిలో, ఇద్దరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని, 583 మార్కులతో యోక్షిత్ టాపర్‌గా నిలిచాడని ప్రిన్సిపాల్ వివరించారు.
చేయి లేకున్నా..
నవోదయ విద్యాలయకు చెందిన బాణోత్ పావని ప్లస్ టూ(బైపీసీ) చదువుతుండగా ఒక చేయి లేకున్నా షూటర్‌గా పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటిందని ప్రిన్సిపాల్ తెలిపారు. అంతేకాక వార్షిక పరీక్షల్లో 79 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని వెల్లడించారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో ‘నవోదయ’ విద్యార్థుల ప్రతిభ

సీబీఎస్‌ఈ ఫలితాల్లో ‘నవోదయ’ విద్యార్థుల ప్రతిభ

సీబీఎస్‌ఈ ఫలితాల్లో ‘నవోదయ’ విద్యార్థుల ప్రతిభ