
ఒకేచోట ఆ మూడు చెట్లు!
ఖమ్మంగాంధీచౌక్: ఉగాది పచ్చడి తయారీలో వినియోగించే ముడిపదార్థాలను ఇచ్చే మూడు రకాల చెట్లు ఒకే చోట ఉండడం విశేషం. ఖమ్మం శ్రీనివాసనగర్ టీచర్స్‌కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న రైస్ మిల్లు ఆవరణలో మామిడి, వేప, చింత చెట్లతో పాటు కొబ్బరి చెట్టు కూడా ఉంది. షడ్రుచుల్లో వగరు రుచి కోసం మామిడి, పులుపు కోసం చింతపండు, వేపను చేదు కోసం ఉపయోగిస్తారు. ఈ మూడు చెట్లుమిల్లు ఆవరణలో ఉండగా.. ఏటా ఉగాదికి మిల్లులోని హమాలీలేకాక స్థానికులు మామిడి కాయలు, చింతకాయలు, వేప పూత కోసుకునే అవకాశం లభిస్తోంది.