పసిబిడ్డకు ప్రాణం పోయండి
కరీంనగర్: అభం.. శుభం.. ఎరగని ఆ పసివాడిని పుట్టుకతో వచ్చే గుండె జబ్బు వేధిస్తోంది. మూడు నెలల ఆ బాలుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కరీంనగర్ కోతిరాంపూర్‌కు చెందిన శనిగరపు రాజు– పద్మ దంపతుల కొడుకు మిట్రల్ స్టెనోసిస్, ఏఎస్‌డి, వీఎస్‌డి, ఓవర్‌రైడింగ్ అయోర్టా పీడీఏతో సహా పుట్టుకతో వచ్చే గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్నాడు. బాబు బతికేందుకు అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాలి. ఇందుకు రూ.12 లక్షలు అవసరం ఉంది. మెకానిక్ షాపులో పనిచేసే రాజుకు సంపాదన అంతంత మాత్రమే. ఇప్పటికే ఉన్న సొమ్మంతా ఆసుపత్రి ఖర్చులకే అయిపోయాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రాణాలతో పోరాడుతున్న ఆ బిడ్డ కోసం దాతల సహకారాన్ని అర్థిస్తున్నారు. తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని కోరుతున్నాడు. సాయం చేయాలనుకునే వారు 9652417926 నంబరుకు సంప్రదించాలని రాజు పద్మ దంపతులు వేడుకున్నారు.
పుట్టుకతోనే గుండె సమస్య
వెంటిలేటర్‌పై చికిత్స
రూ.12 లక్షలు అవసరం
దాతలు ఆదుకోవాలని వేడుకోలు


