కిక్కిరిసిన కొండగట్టు
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు అంజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. దీంతో సాధారణ భక్తులతోపాటు జాతరకు వెళ్లే భక్తులు రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. టికెట్ల విక్రయాలు, లడ్డూ, పులిహోర విక్రయాలు, వాహనపూజల ద్వారా ఆలయానికి రూ.7.35 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు, ఏఈఓ హరిహరనాథ్, ఆలయ ఇన్స్‌పెక్టర్లు అశోక్, ఉమామహేశ్వర్‌రావు పర్యవేక్షించారు.


