బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలక సంస్థ కార్మి కులు, సిబ్బందికి రూ.30 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యే క అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పారిశుధ్య కార్మికులకు పీపీఈ, శానిటేషన్ కిట్లు అందించారు. పారిశుధ్య జవాన్ శ్యాంసుందర్ మృతిపై మౌనం పాటించి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికులు ప్రమాదాల బారిన పడితే కుటుంబానికి రూ.30 లక్షలు అందేలా బీమా చేస్తున్నామన్నారు. పీపీఈ కిట్లను కార్మికులు పనిసమయాల్లో తప్పకుండా వినియోగించాలన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. పారిశుధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారధి సొసైటీ ద్వారా గ్లౌస్‌లు, షూలు, ఆఫ్రాన్‌లు, మాస్కులతో పాటు సబ్బులు, ఆయిల్ లాంటి వస్తువులతో కూడిన పీపీఈ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, హెల్త్ ఆఫీసర్ సుమన్, వారధి సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.
ఎన్‌సీడీ వ్యాధులపై దృష్టి పెట్టండి
కరీంనగర్: నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) వ్యాధులపై దృష్టి సారించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. కరీంనగర్‌లోని మోతాజ్‌ఖానా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. 30ఏళ్లు పైబడినవారికి అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయినవారికి మందులు అందజేయాలన్నారు. గృహ సందర్శనల ద్వారా శిశు సంరక్షణ, పోషకాహారంపై తల్లులకు అవగా హన కల్పించాలన్నారు. ఆరోగ్య మహిళ క్యాంపుల్లో 100శాతం రీస్క్రీనింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నించాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను, బరువు తక్కువ ఉన్న పిల్లలను (ఎస్‌ఏఎం, ఎస్‌యూడబ్ల్యూ)గుర్తించి పోషకాహార పునరావాస జిల్లా కేంద్రానికి పంపించడానికి తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. పీవో ఎన్‌సీడీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్‌ఎన్ సన జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇమ్రాన్ పాల్గొన్నారు.
కొత్తపల్లి: విద్యార్థులు విద్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ చాటాలని డీఈవో శ్రీరాం మొండయ్య సూచించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్నేహిత ఫేజ్–2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యం దశ నుంచే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాలన్నారు. సీడీపీవో సబిత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుణ, జీసీడీవో కృపారాణి, షీటీం సభ్యురాలు స్వప్న, హెచ్‌ఎం టి.శోభారాణి పాల్గొన్నారు.
కరీంనగర్‌కల్చరల్: నిజామాబాద్‌కు చెందిన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న నిజామాబాద్‌లో జరిగే సరస్వతీరాజ్ సాహిత్యోత్సవంలో అందించే వచన కవితా పురస్కారాలకు జిల్లా కేంద్రానికి చెందిన సబ్బని లక్ష్మీనారాయణ, అన్నవరం దేవేందర్‌లు ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. నగదు పురస్కారంతో పాటు సన్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇరువురికి పలువురు కవులు, రచయితలు, రచయిత్రులు అభినందనలు తెలిపారు.
బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా
బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా


