
విపత్తులో ‘ఆపద మిత్ర’ ముందుండాలి
కరీంనగర్ అర్బన్: ప్రకతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించేందుకు ‘ఆపద మిత్ర’ వలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం బీసీ స్టడీ సర్కిల్‌లో ఆమె ప్రారంభించారు. అవగాహన లేకపోవడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎదుర్కునేందుకు మొదటిదఫాలో గ్రామాల్లో, పట్టణాల్లో పని చేసే ప్రభుత్వరంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. రెండో విడతలో డిగ్రీ, ఎన్‌సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫైర్, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ, సైబర్ తదితర అధికా రుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క కాటు, అగ్నిప్రమా దం, సీపీఆర్, షాట్ సర్క్యూట్, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణను ఇవ్వనున్నామని అన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు శిక్షణ తీసుకున్న వారు ప్రమాదాల నివారణకు ముందుంటారన్నా రు. నైపుణ్యాలతో కూడిన శిక్షణతో తమను రక్షించుకోవడంతో పాటు పదిమంది ప్రాణాలు కాపాడగలరని పేర్కొన్నారు. శిక్షణకు హాజరైన వారు నేర్చుకున్న నైపుణ్యాలను, మెలకువలను మరో పదిమందికి నేర్పించాలని సూచించారు. ఆపద ఎప్పుడైనా రావొచ్చని.. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. డీఆర్‌వో వెంకటేశ్వ ర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి