
ఆరునెలల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
కాల్వ శ్రీరాంపూర్(పెద్దపల్లి): ఇద్దరు అన్నదమ్మలు ఏడాది వ్యవధిలోనే వేర్వేరు కారణాలతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన తూండ్ల రాజు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో పది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది వ్యవధిలోనే ఇద్దరు కుమారులు వేర్వేరు కారణాలతో మృతిచెందడంతో తల్లిదండ్రులు దేవమ్మ –మధునయ్య కన్నీటి పర్యంతమయ్యారు. దినసరి కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు.. వచ్చే ఆదాయంతోనే ఇద్దరు కుమారులను పెంచి పోషించి ప్రయోజకులను చేశారు. మలిదశలో తమ బాగోగు చూస్తారనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడం తల్లిదండ్రులకు శోకం మిగిల్చినట్లయ్యింది. కాగా, రాజుకు భార్య రేవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
కాల్వశ్రీరాంపూర్‌లో విషాదం

ఆరునెలల వ్యవధిలో అన్నదమ్ములు మృతి