
అభ్యాసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన
కరీంనగర్: అభ్యాసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన సాగాలని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. బుధవారం సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 9,10వ తరగతుల్లో జరుగుతున్న జీవశాస్త్ర, గణితశాస్త్ర బోధనాభ్యాసన ప్రక్రియలను పరిశీలించారు. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులతో సమావేశమై అభ్యసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన సాగాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త మిల్కూరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఎం.రాజేందర్ పాల్గొన్నారు.