
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్‌క్రైం: నగరంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతామని సీపీ గౌస్ ఆలం అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌తో కలిసి నగరంలోని వివిధ బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. పద్మనగర్ బైపాస్, రాంనగర్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్, మంచిర్యాల చౌరస్తా, గాంధీరోడ్డు, నాఖాచౌరస్తా, కేబుల్ బ్రిడ్జి, బైపాస్ రోడ్డులోని మలుపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ఆలం మాట్లాడుతూ.. నగరపాలక పరిధి లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌లను గుర్తించామని తెలిపా రు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల ఐలాండ్లు, యూటర్న్‌లు, యూటర్న్‌ల కుదింపు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.