
హోమియోను మించిన వైద్యం లేదు
● స్వీయ అనుభవాన్ని వివరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ● కరీంనగర్‌లో హోమియో వైద్యుల ఐదో రాష్ట్రస్థాయి సైంటిఫిక్ సెమినార్
కరీంనగర్‌టౌన్: వైద్యరంగంలో హోమియోను మించిన చికిత్స లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని పద్మనగర్‌లో 5వ రాష్ట్రస్థాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ సైంటిఫిక్ సెమినార్‌ను ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సెమినార్లో కరీంనగర్‌కు చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు కొడిత్యాల శ్రీనివాస్ లైవ్‌లో ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీపై, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాతలాజికల్ ప్రిస్క్రిప్షన్‌న్‌పై, డాక్టర్ గణేశ్ ఆచారి కార్డియోమైపోతిపై, డాక్టర్ హీరాలాల్ అగర్వాల్ రేనల్ వ్యాధులపై, సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తన చేతుల మీదుగా వందల హాస్పిటళ్లు ప్రారంభించానని, హోమియో వైద్య సదస్సుకు రావడం ఇదే ప్రథమమన్నారు. ఈ సదస్సుకు తను ఇష్టంతో వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా తన స్వీయ అనుభవాన్ని వివరించారు. మానేరు రివర్ ఫ్రంట్ స్టడీ కోసం సీయోల్‌కు వెళ్లగానే తనకు విపరీతమైన దగ్గు వచ్చిందన్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా తగ్గలేదని, ఒక మంత్రి సూచన మేరకు హోమియో వాడిన వారం రోజుల్లోనే పూర్తి రిలీఫ్ వచ్చిందని తెలిపారు. హోమియో వైద్యుల సంఘ భవన స్థలానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 2025–27 సంవత్సరానికి గానూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా గుజరాత్‌కు చెందిన డాక్టర్ నిశికత్ తాపే వ్యవహరించారు. కరీంనగర్ యూనిట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. హోమియోపతి వైద్యుల జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శివమూర్తి, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ.రావు, డాక్టర్ ఎంఎన్ రాజు, డాక్టర్లు దీపక్ బాబు, ఎన్‌ఎస్.రెడ్డి, దయాకర్, దినకర్, రవికుమార్, రవీంద్రచారి, హప్సాన, కృష్ణకాంత్, 300మంది వైద్యులు పాల్గొన్నారు.