
ఎంఐఎంకు అనుకూలంగా డీలిమిటేషన్
● మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ నగరపాలక సంస్థ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అశాసీ్త్రయంగా.. ఎంఐఎంకు అనుకూలంగా జరిగిందని మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. శనివారం కరీంనగర్‌లో మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ సర్వేలు చూసినా బీజేపీయే గెలుస్తుందని తెలుసుకొని అధికార కాంగ్రెస్ హైడ్రామాకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పడిపోతుందనే భయంతోనే ఎంఐఎంకు అనుకూలంగా డివిజన్ల మార్పు చేపట్టిందన్నారు. కేవలం 6 డివిజన్లలో ఎంఐఎంకు బలం ఉండగా, దాన్ని 16 డివిజన్లలో అనుకూలంగా మార్చారని మండిపడ్డారు. ఇందులో అధికారులు ఒత్తిళ్లకు లోనయ్యారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని, ఎంఐఎం పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్‌ను కట్టబెట్టే కుట్రలో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ నాయకత్వంలో అభివృద్దిని నమ్ముకొని ముందుకెళుతున్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. నాయకులు శ్రీనివాస్, చంద్రమౌళి, రమణారెడ్డి, లెక్కల వేణు, కాసర్ల ఆనంద్, సతీశ్, గాయత్రి, గాజ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.