
సత్తా చాటాలి
రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాల ఎంపిక పోటోల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటాలి. 4వతరగతిలో అన్ని క్రీడాపాఠశాలల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులే సీట్లు సంపాదించాలి. తెలంగాణలో క్రీడల్లో ఉమ్మడి జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. క్రీడల్లో రాణించినవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. అది క్రీడాపాఠశాలతోనే సాధ్యమవుతుంది.
– తుమ్మల రమేశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు
20కి పైగా సాధించాలి
రాష్ట్రస్థాయి ఎంపికలో 9 కేటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ఈవెంట్లలో మంచి స్కోరింగ్ సాధించాలి. మెడిసిన్ బాల్‌త్రో, షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో స్కోరింగ్ ఎక్కువగా చేయొచ్చు. మొత్తం 27 పాయింట్లకు గాను 20 పాయింట్లకు పైగా స్కోరింగ్ చేస్తే సీటు సంపాదించొచ్చు.
– నాగిరెడ్డి సిద్ధారెడ్డి,
శాట్స్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్

సత్తా చాటాలి