
రాజన్నకు ఆషాఢపూజలు
వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను జూలై 1న ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించనున్నట్లు ఈవో రాధాభాయి తెలపారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు.
అంజన్న సన్నిధిలో ఫోరెన్సిక్ డైరెక్టర్ పూజలు
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ దనూజ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఏఎస్సై శ్రీనివాస్, పాల్గొన్నారు.
యాదగిరి గుట్టకు ప్రత్యేక బస్సు
జగిత్యాలటౌన్: యాదగిరి గుట్ట తదితర ఆలయాల దర్శనం కోసం జగిత్యాల నుంచి ప్రత్యేక బస్సు నడిపిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ కల్పన అన్నారు. శుక్రవారం ఆలయాల కోసం కేటాయించిన ప్రత్యేక బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 5గంటలకు జగిత్యాల నుంచి బయలు దేరిన ప్రత్యేక సూపర్‌లగ్జరీ బస్సు కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి, స్వర్ణగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.880, పిల్లలకు రూ.450 చార్జి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు.
దాడి చేసుకున్న హిజ్రాలు
● భయభ్రాంతులకు గురైన స్థానికులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పాతబస్టాండ్‌లో గురువారం రాత్రి హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన హిజ్రాలు పాతబస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా సిద్ధిపేట జిల్లాకు చెందిన మరికొంత మంది హిజ్రాలు పాతబస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో తమ అనుమతి లేకుండా తమ జిల్లాకు ఎందుకు వచ్చారంటూ రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో రెచ్చిపోయిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హిజ్రాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

రాజన్నకు ఆషాఢపూజలు

రాజన్నకు ఆషాఢపూజలు