
పది నిమిషాల్లో ఇంటి వద్ద ఉంటా
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున (గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత) గుర్తుతెలి యని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యు వకులు దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి రూ రల్ ఎస్సై మల్లేశ్ కథనం ప్రకారం.. జిల్లాలోని గో దావరిఖని ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన చిలుకల చక్రి(24) సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా ప నిచేస్తున్నాడు. తన మిత్రుడు తిలక్‌నగర్‌కు చెందిన సోగాల శ్యామ్ (22)తో కలిసి పెద్దపల్లి నుంచి గో దావరిఖనికి బైక్‌పై వెళ్తున్నారు. ఈక్రమంలో అప్పన్నపేట వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహ నం వీరి బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అయితే, స్నేహితుడి వద్దకు వెళ్లొస్తామంటూ చెప్పి బయల్దేరిన కొడుకు ఇలా శవమై కనిపిస్తాడనుకోలేదంటూ మృతుల కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. ఇంకా ఇంటికి రాలేదేంటని ఫోన్‌చేస్తే.. పదినిమిషాల్లో ఇంటికాడ ఉంటా.. అని చెప్పిన తన కుమారుడు కని పించకుండా పోయాడని చిలుకల చక్రి తండ్రి వినో ద్ విలపించాడు. సింగరేణి గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తు న్న చక్రికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉండగా, శ్యాం అవివాహితుడు. మృతదేహాలకు పె ద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి..
ఆ వెంటనే రోడ్డు ప్రమాదం
ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
ఇద్దరు యువకుల దుర్మరణం
అప్పన్నపేట వద్ద ఘటన

పది నిమిషాల్లో ఇంటి వద్ద ఉంటా