
దరఖాస్తు చేసిన వెంటనే రుణాలు
● యూబీఐ హెడ్ అపర్ణరెడ్డి
సుల్తానాబాద్(పెద్దపల్లి): అర్హులైన రైతులకు దరఖాస్తు చేసిన వెంటనే రుణాలు మంజూరు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం అగ్రి రైస్ ఔట్ రీచ్ రైతులకు అవగాహన కల్పించారు. బ్యాంక్ సేవలు అందుబాటులో లేనిరైతులకు శిబిరాల ద్వారా పరిచయం చేస్తామని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, ఏజీఎం సురేశ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ కిశోర్‌కుమార్, రైస్‌మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్‌కుమార్, వెంగళదాసు శ్రీధర్, రైస్‌మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తంరావు, జెపాల్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు పల్ల మురళి, చీటి కేశవరావు పాల్గొన్నారు.