యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
గాంధారి(ఎల్లారెడ్డి): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో రోడ్డు భద్ర తా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శా ఖ అధికారులు సూచించారు. సోమవారం స్థాని క కేజీబీవీని సందర్శించి విద్యార్థినులకు రోడ్డు భ ద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డుపై ప్ర యాణం చేసేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధ రించాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యా లు వినియోగిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారిణి శిల్ప, రవాణా శాఖాధికారులు స్నిగ్ద, మధుకర్, శ్రవణ్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
● ఎన్నికల సాధారణ పరిశీలకుడు
సత్యనారాయణరెడ్డి
కామారెడ్డిక్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, భద్రత, రవాణా, తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలకు సంబంధించిన నివేదికలను ప్రతి రోజూ పంపాలన్నారు. అభ్యర్థుల ఖర్చులు నమోదు చేయాలన్నారు. ప్రతి మండలానికి అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల డిపాజిట్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అనధికార ప్రవేశాలు ఉండకూడదని సూచించారు. పీవో, ఏపీవోలకు అన్ని అంశాలపై అవగాహన ఉండేలా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, డీపీవో మురళీ, తదితరులు పాల్గొన్నారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి


