‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’

Dec 2 2025 7:40 AM | Updated on Dec 2 2025 7:42 AM

కామారెడ్డి టౌన్‌: సమాజంలో చిన్నారుల భ ద్రతకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాల సదన్‌లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ మూర్తి మా ట్లాడుతూ పిల్లలతో స్నేహపూర్వకంగా మా ట్లాడి వారి అభిరుచులు తెలుసుకోవాలని, భవిష్యత్‌ లక్ష్యాలను ప్రోత్సహిస్తూ సూచనలు ఇవ్వాలని సూచించారు. బాలసదనంలోని చిన్నారుల పరిస్థితులు, ఆరోగ్యం, మా నసిక స్థితి, అవసరమైన సహాయాలపై స మగ్ర సమీక్ష నిర్వహించారు. వంటగది, వస తి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా శిశు సంరక్షణ అధికారి స్రవంతి, బాలసదన్‌ సి బ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

వడ్లు ఎప్పుడు కొంటరు?

అక్కాపూర్‌లో రైతుల ఆందోళన

మాచారెడ్డి : అక్కాపూర్‌లో ఇరవై ఐదు రోజులుగా ధాన్యం కాంటా పెట్టడం లేదని రైతు లు ఆరోపించారు. సోమవారం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. రోజూ రా త్రి చలిలో వడ్లకు కాపలా ఉంటూ అనారో గ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చే శారు. అర్ధరాత్రి అడవి పందులు దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు వెంట నే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయా లని రైతులు డిమాండ్‌ చేశారు.

‘బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి’

భిక్కనూరు: సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. సోమవారం అంతంపల్లి గ్రామానికి చెందిన సింగిల్‌విండో డైరెక్టర్‌ స్వరూప సిద్దరాములుతో పాటు కాంగ్రెస్‌ నేతలు పోచయ్య, లింబారెడ్డి, యాచం సురేశ్‌ గుప్తా, రాజిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ వెంటక్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మధుమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతోనే

హెచ్‌ఐవీ నివారణ

కామారెడ్డి టౌన్‌: అవగాహనతోనే హెచ్‌ఐవీ వ్యాధిని నివారించవచ్చని, ఎయిడ్స్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి హెచ్‌ఐవీ కేసులు నమోదు కాని జిల్లాగా మార్చాలన్నారు. టీ సాక్స్‌, స్వచ్ఛంద సంస్థలు హెచ్‌ఐవీ నివారణలో చేస్తున్న కృషిని అభినందించారు. ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో విద్య రన్వాల్కర్‌, ఎయిడ్స్‌ నివారణ ప్రోగ్రాం అధికారి రాధిక, నోడల్‌ అధికారి శరత్‌ కుమార్‌, ఏఆర్టీ మెడికల్‌ ఆఫీసర్లు స్నేహ, ప్రీతి, మక్బూల్‌, సాయి కిరణ్‌, ఐసీటీసీ కౌన్సిలర్‌ నాగరాజు, వైఆర్‌జీ కేర్‌ డీఆర్పీ సుధాకర్‌, వర్డ్‌ స్వచ్ఛంద సంస్థ ఎంసీ రమేశ్‌, ఎస్‌ఎస్‌కే మేనేజర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’ 
1
1/3

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’ 
2
2/3

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’ 
3
3/3

‘చిన్నారుల భద్రతకు బాధ్యత వహించాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement