‘ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి’
తాడ్వాయి : పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల స్టేట్ అబ్జర్వర్ సత్యనారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైన సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే పైఅధికారులకు చెప్పాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో మురళి, డీఈవో రాజు, ఎంపీడీవో సయ్యద్ సాజిద్‌అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవిత, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.


