పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం | - | Sakshi
Sakshi News home page

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం

Jul 3 2025 7:35 AM | Updated on Jul 3 2025 7:41 AM

డ్రైవర్స్‌ కాలనీలో ఇందిరమ్మ

ఇళ్ల పక్కన మురికి కాలువ

కామారెడ్డి మున్సిపాలిటీలో 25 వేలకుపైగా గృహాలున్నాయి. పట్టణ జనాభా లక్ష దాటింది. పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. అయితే అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోంది. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలతో పట్టణం చెత్త కుప్పలా కనిపిస్తోంది. శివారు కాలనీలతోపాటు గోదాంరోడ్‌, రాజీవ్‌నగర్‌, ఇందిరానగర్‌, డ్రైవర్స్‌కాలనీ, డబుల్‌బెడ్‌రూం, టీచర్స్‌కాలనీ, గాంధీనగర్‌, బతుకమ్మకుంట, రుక్మిణికుంట, శ్రీరాంనగర్‌కాలనీ, వికాస్‌నగర్‌, గొల్లవాడ, కిష్టమ్మగుడి, పెద్ద కాలనీ, వీక్లీమార్కెట్‌, అయ్యప్పనగర్‌, హరిజనవాడ, గ్రీన్‌ సిటీ తదితర కాలనీలలో కూడళ్లు, ఖాళీ స్థలాలలో చెత్త పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ఓపెన్‌ స్థలాలైతే డంపింగ్‌ యార్డులుగా మారాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.

డ్రెయినేజీ సమస్య..

పట్టణంలో చాలా కాలనీలలో ఇంకా పక్కా సీసీ డ్రెయినేజేలు లేవు. రోడ్లపైనే మురుగు నీరు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డ్రెయినేజీలు ఉన్న చోట కూడా సమస్యలున్నాయి. కొన్నిచోట్ల నెలల తరబడి డ్రెయినేజీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మురుగు నిండి రోడ్లపైకి వస్తోంది. వర్షాకాలం కావడంతో మురికి నీటి ప్రవాహం ఎక్కువై రోడ్లపైకి వస్తుండడంతో కాలనీలు కంపు కొడుతున్నాయి. దోమలతోపాటు కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రోడ్ల శుభ్రత పైనే అధికారులు దృష్టి సారించడంతో కాలనీలు ‘స్వచ్ఛ’తకు దూరమయ్యాయి.

‘తడి–పొడి’.. అంతా భ్రమ

బల్దియా సానిటేషన్‌ విభాగంలో 19 ఆటోలు, 5 ట్రాక్టర్లు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉంటుంది. కానీ పట్టణంలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. తడి, పొడి చెత్తను కలిపే సేకరిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు, బయోవేస్టేజ్‌, మాంసపు వర్థాలు, వంటింటి తడి చెత్త వ్యర్థాలు ఇలా అన్నీ కలిపి సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించడంతో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. డంపింగ్‌ యార్డు వద్ద కూడా తడి పొడి చెత్తను వేరు చేయడం లేదు.

ఏళ్లుగా ఇదే పరిస్థితి..

మా ఇళ్ల పక్కన మురికి కాలువ అధ్వానంగా ఉంది. రోడ్లపైకి మురుగు నీరు వస్తోంది. దీంతో దోమలు, ఈగలు విపరీతంగా ఉంటున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. డ్రెయినేజీ నిర్మించాలి.

– ఎండీ. మక్బూల్‌, టీచర్స్‌ కాలనీవాసి

శుభ్రం చేయడం లేదు

రోడ్లను నెలల తరబడి శుభ్రం చేయడం లేదు. మురికి కాలువలను సైతం శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగి విషప్రాణులు సంచరిస్తున్నాయి. మోరీల్లోంచి చెత్తను తీసి రోడ్లపై వేస్తారు. వారం రోజులైనా తీయరు.

– నర్సింలు, వీక్లీ మార్కెట్‌వాసి

స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతాం..

అన్ని వార్డులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సానిటేషన్‌ సమస్యలుంటే ప్రజలు నేరుగా మాకు ఫిర్యాదు చేయాలి. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సానిటేషన్‌ సమస్యలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి ఆయా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం.

– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

ముక్కు మూసుకుంటున్నాం

సిరిసిల్ల రోడ్‌లో ఉన్న మురికి కాలువల్లో మాంసం వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో దుర్గధం వ్యాపిస్తోంది. ముక్కు మూసుకుని వెళ్లాల్సి న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి మురికి కాలువల్లో మాసం వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలి.

– మల్లేశ్‌, సిరిసిల్ల రోడ్‌వాసి

బల్దియాలో పారిశుద్ధ్య

నిర్వహణ అస్తవ్యస్తం

తడి, పొడి.. కలిపే సేకరణ

పలు కాలనీలలో కానరాని

పక్కా డ్రైయినేజీలు

పూడుకుపోయిన మోరీలు..

రోడ్లపైకి మురుగు పరుగు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం1
1/5

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం2
2/5

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం3
3/5

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం4
4/5

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం5
5/5

పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement