
ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యార్థి మృతి
మద్నూర్(జుక్కల్): కుర్లా గ్రామానికి చెందిన వడ్ల యోగేశ్(23) బుధవారం ఫిలిప్పీన్స్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పుట్టిన రోజు నాడే యోగేశ్ మృతి చెందడంతో ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుర్లా గ్రామంలో ఆర్‌ఎంపీగా వైద్య సేవలు అందిస్తున్న రాజేందర్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రెండో కూమారుడు యోగేశ్ ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. యోగేశ్ పది రోజుల క్రితమే కుర్లాకు వచ్చి వెళ్లాడు. బుధవారం ఫిలిప్పీన్స్‌లో కళాశాలకు వెళ్దామని బయలుదేరే సమయంలో యోగేశ్‌కు ఛాతీలో నొప్పి వచ్చిందని తండ్రికి తెలపగా దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితులు సాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యోగేశ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
గుండెపోటుతో అకాల మరణం
పుట్టిన రోజు నాడే మృతి..
కన్నీరుమున్నీరైన కుటుంబీకులు