
పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు
కామారెడ్డి టౌన్: పట్టణంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘పురం.. స్వచ్ఛతకు దూరం’ కథనంపై ఆయన స్పందించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల తీరుపై సానిటరీ ఇన్‌స్పెక్టర్, జవాన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులను పరిశీలించారు. టీచర్స్‌కాలనీ, రాజీవ్‌నగర్, సైలానీబాబా తదితర కాలనీలలో మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు. రోడ్ల పక్కన పేరకుపోయిన చెత్త కుప్పలను డపింగ్ యార్డుకు తరలించారు. మురికి కాలువలు లేని చోట నూతన సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి

పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు

పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు