
కొబ్బరి కొండెక్కింది!
బొండం నుంచి నూనె వరకు.. ● భారీగా పెరిగిన ధరలు
భిక్కనూరు : ఆషాఢ మాసం అయినప్పటికీ కొబ్బరి కాయల ధరలు కొండెక్కాయి. పక్షం రోజుల్లోనే 20 శాతం పెరిగాయి. పదిహేను రోజుల క్రితం ఒ క్కో ఎండు కొబ్బరికాయ ధర రూ. 25 ఉండేది. ప్రస్తుతం రూ. 30కి చేరింది. కొబ్బరి బొండం కూడా రూ. 50 నుంచి రూ. 80 వరకు వి క్రయిస్తున్నారు. కుడుకల ధరల కూ రెక్కలొ చ్చాయి. పక్షం రో జుల్లోనే కిలో కుడుకల ధర రూ. 280 నుంచి రూ. 400లకు చేర డం గమనార్హం. కొబ్బరి నూనె ధర కూడా పెరిగింది. 175 ఎంఎల్ కొబ్బరి నూనె ధర గతంలో రూ. 70 ఉండగా ప్రస్తుతం రూ. 125 కు విక్రయిస్తున్నారు. కొబ్బరి ధరలు ఇలా భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట తక్కువగా ఉండడంతోనే ధరలు పెరుగుతు న్నాయని వ్యాపారులంటున్నారు.

కొబ్బరి కొండెక్కింది!