పేలుడు పదార్థాల కలకలం | - | Sakshi
Sakshi News home page

పేలుడు పదార్థాల కలకలం

Jul 5 2025 6:36 AM | Updated on Jul 5 2025 6:40 AM

కామారెడ్డి క్రైం : పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల నిల్వలు బయటపడడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఓ ఇంటి నిర్మాణం కోసం బండరాళ్ల బ్లాస్టింగ్‌కు ఈ సామగ్రిని వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పట్టణంలోని పీఎంహెచ్‌ కాలనీలో నివాసం ఉంటున్న చింతల శ్రీధర్‌కు కేపీఆర్‌ కాలనీలో ఓ ప్లా టు ఉంది. దాంట్లో ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించాడు. గుంతలు తీయగా వచ్చిన బండరాళ్లను పేల్చివేసి తొలగించడానికి బొంత సంపత్‌, లక్ష్మీనారాయణ, రాజులతో రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమ పద్ధతిలో సేకరించిన జిలెటిన్‌ స్టిక్స్‌, డి టోనేటర్లు, కార్డెక్స్‌ వైరు, బ్యాటరీలతో బండరాళ్లను పేల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు దీనిని గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరోచోట పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం బయటపడింది. పట్టణానికి సమీపంలోని లింగాపూర్‌ శివారులో ఇటీవలే వెలసిన శ్రీవారి వెంచర్‌లోని రేకుల షెడ్డులో 1,564 జిలెటిన్‌ స్టిక్స్‌, 41 డిటోనేటర్లు, 16 బెండల్స్‌(సుమారు 4,300 మీటర్లు) కార్డెక్స్‌ వైరు, బ్యాటరీ, ఒక చెక్‌ మీటర్‌, ఇతర సామగ్రిని అక్రమంగా నిల్వ చే సినట్లు గుర్తించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసు కున్నారు. శంకర్‌, స్వామి అనే వ్యక్తుల ద్వారా పేలు డు పదార్థాలను తెప్పించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతానికి చింతల శ్రీధర్‌, సంపత్‌, లక్ష్మీ నారాయణ, రాజులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు. విచారణలో చాకచక్యం గా వ్యవహరించిన ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సై శ్రీ రాం, కానిస్టేబుళ్లు నరేష్‌, విశ్వనాథ్‌, అనిల్‌, విజయ్‌ గౌడ్‌, వినయ్‌, సంపత్‌, నర్సారెడ్డిలను అభినందించారు.

వెంచర్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు

పదార్థాలు

జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్ల పేల్చివేత..

కేపీఆర్‌ కాలనీలోని శ్రీధర్‌ ప్లాట్‌లో బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను సిద్ధం చేసి ఉంచినట్లు గుర్తించిన పోలీసులు.. బాంబ్‌ స్క్వాడ్‌ బృందాన్ని రప్పించారు. శుక్రవారం సాయంత్రం కాలనీలో ప్రజల రాకపోకలను నిలిపివేసి ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటిపై మట్టి కుప్పలు పోయించి, జాగ్రత్తలు తీసుకుంటూ పేల్చివేశారు.

జిల్లాకేంద్రంలో 1,564 జిలెటిన్‌ స్టిక్స్‌, 41 డిటోనేటర్‌లు స్వాధీనం

16 బెండళ్ల కార్డెక్స్‌ వైరు, ఇతర సామగ్రి సైతం..

రాళ్ల బ్లాస్టింగ్‌కు ఉపయోగిస్తుండగా పోలీసులకు సమాచారం

నలుగురిపై కేసు నమోదు,

నిందితుల రిమాండ్‌

పేలుడు పదార్థాల కలకలం1
1/1

పేలుడు పదార్థాల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement