
రోశయ్య సేవలు మరువలేనివి
కామారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రోశయ్య జయంతిని కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్‌గా రోశయ్య అందించిన సేవలు విలువైనవని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌లు విక్టర్, చందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సాయిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

రోశయ్య సేవలు మరువలేనివి