
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
గాంధారి : ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖాధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం జిల్లాలోని వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు ఆయిల్‌పాం తోటలు, ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించారు. ఆయిల్‌పాం మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తుందన్నారు. ఇందులో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏడీఏలు అపర్ణ, సుధా మాధురి, మండల ఏవో రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం డీఈవో రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ గతేడాది పదో తరగతి, ఇంటర్‌లలో ఉత్తీర్ణత శాతం బాగుందన్నారు. పాఠశాల నిర్వహణ, మెనూ అందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ మాధవరావు, సిబ్బంది చరణ్ కుమార్ ఉన్నారు.
నేడు ఎస్సీ, ఎస్టీ
కమిషన్ బృందం రాక
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఐదుగురు సభ్యుల బృందం శనివారం జిల్లాకు రానుంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ పీడన నిరోధక చట్టం(పీసీఆర్ యాక్ట్), అట్టడుగు వర్గాలపై దాడులను నిరోధించే ప్రత్యేక చట్టం (పీవోఏ యాక్ట్), ల్యాండ్, సర్వీస్ విషయాలపై ఆయన సమీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి బాధితులు హాజరవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు వేరొక ప్రకటనలో కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వినతి పత్రాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు