
బల్దియాలో దారిద్య్రం!
అశోక్‌నగర్ కాలనీలో గుంతలలో నిలిచిన వర్షపు నీరు
జిల్లాకేంద్రంలోని అన్ని రోడ్లపైనా భారీ గుంతలు ఏర్పడ్డాయి. అశోక్‌నగర్ కాలనీ ప్రధాన రోడ్డుగుండా వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పలుచోట్ల వర్షంతో బురదమయంగా మారింది. గుంతలనిండా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ రోడ్డు దుస్థితిపై ఇటీవల స్థానికులు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో స్థానికులే మట్టిని పోసి గుంతలను పూడ్చారు.
కొత్తబస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు రోడ్డు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. విద్యానగర్‌కాలనీలో సాయిబాబా ఆలయం పక్కన చౌరస్తాలో పెద్ద గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా పూడ్చేవారు లేరు. జన్మభూమిరోడ్‌లో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. సైలానీబాబా కాలనీ, రామారెడ్డి చౌరస్తా నుంచి రాజీవ్‌నగర్‌కాలనీ వరకు, పాతబస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ కాలనీ, అడ్లూర్ వరకు, పెద్దబజార్, భవానీరోడ్, వీక్లీ మార్కెట్‌రోడ్, గోపాలస్వామిరోడ్, భవానీనగర్, సుభాష్‌రోడ్, సిరిసిల్లరోడ్, గాంధీనగర్ లాంటి ప్రధాన రోడ్లపైనా భారీగా గుంతలున్నాయి. ప్రధాన రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక అంతర్గత రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్ల పరిస్థితిపై మున్సిపల్ అధికారులతో పాటు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, మరమ్మతులు చేయించి గుంతల చింత తీర్చాలని కోరుతున్నారు.
మరమ్మతులు చేయిస్తాం
బల్దియాలో నిధులు లేక నూతన రోడ్ల పనులకు టెండర్లు నిర్వహించడం లేదు. అయితే పట్టణంలో ఎక్కువగా గుంతలున్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేయిస్తాం. అశోక్‌నగర్ కాలనీలో నూతన రోడ్డు వేయడానికి కృషి చేస్తాం. ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి అన్ని కాలనీలలో రోడ్లపై గుంతలను పూడ్చివేయిస్తాం.
– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
కామారెడ్డి బల్దియా పరిధిలోని అంతర్గత రోడ్లతోపాటు ప్రధాన రోడ్లూ అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో వరద నీరు చేరి మరింత ప్రమాదకరంగా మారాయి. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. – కామారెడ్డి టౌన్
కామారెడ్డి పట్టణంలో ఛిద్రమైన రోడ్లు
వర్షపు నీటితో ప్రమాదకరంగా
మారిన గుంతలు
ఇబ్బందిపడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు

బల్దియాలో దారిద్య్రం!

బల్దియాలో దారిద్య్రం!

బల్దియాలో దారిద్య్రం!

బల్దియాలో దారిద్య్రం!