పహాణి అంటే..? | - | Sakshi
Sakshi News home page

పహాణి అంటే..?

Jul 3 2025 7:35 AM | Updated on Jul 3 2025 7:35 AM

పహాణి అంటే..?

పహాణి అంటే..?

హాణి అంటే భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల ముఖ్యమైన పత్రం. దీనిని అడంగళ్‌ అని కూడా అంటారు.

● పహాణిలో భూమి యజమాని, సాగు చేస్తున్న వారి పేరు, సర్వే నంబర్‌, ఖాతా నంబర్‌, భూమి యొక్క విస్తీర్ణం, కొలతలు ఉంటాయి.

● భూమికి నీటి సదుపాయం(బావి, కాలువ, చెరువు), నేల రకం(సారవంతమైన, రాతి నేల) అనే స్వభావం పేర్కొనబడి ఉంటుంది.

● పహాణిలో భూమిలో సాగు చేస్తున్న పంటల వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

● పహాణి భూమి యజమానికి చట్టపరమైన హక్కులను కల్పిస్తుంది. భూమి కొనుగోలు, అమ్మకం లేదా బదిలీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

● భూమికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే సమయంలో ఉపయోగ పడుతుంది.

● బ్యాంకు నుంచి పంట రుణం, ఇతర రుణాలు తీసుకోడానికి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోడానికి పహాణి ఉపయోగ పడుతుంది.

– బాల్కొండ

మీకు తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement