
‘సహకారం’తో రైతులు, కార్మికులకు ప్రయోజనం
సుభాష్‌నగర్: సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యాపారులు లాభపడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ అలయెన్స్ (ఐసీఏ) ఆధ్వర్యంలో లండన్‌లోని మాంచెస్టర్ నగరంలో కో ఆపరేటీవ్ యాక్టివిటీస్ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటీవ్ బ్యాంక్స్ లిమిటెడ్ (ఎన్‌ఏఎఫ్‌ఎస్‌సీఓబీ) తరఫున కుంట రమేశ్‌రెడ్డి సదస్సుకు హాజరై ప్రసంగించారు. యూఎన్‌వో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంస్థలు రైతులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయని, గ్రామీణ వ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న సౌకర్యాలను రమేశ్‌రెడ్డి వివరించారు.