
ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ గాలికి!
నిజాంసాగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల నిర్వహణను గాలికి వదిలేశారు. ఏటా వర్షాకాలం ప్రారంభానికి రెండు నెలల ముందే ప్రాజెక్టు వర ద గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ చే యించాల్సి ఉంది. మరో పక్షం రోజుల్లో వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్నా.. ఇప్పటికీ పనుల ఊసే లేదు.
నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లతో పాటు కల్యాణి, సింగితం రిజర్వాయర్ వరద గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనుల కోసం ప్ర భుత్వం రూ. 8 లక్షలు మంజూరు చేసింది. కానీ ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావ డం లేదు. రిస్క్‌తో కూడుకున్న పను లు కావడం, పనులు చేసినా సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు సింగి తం రిజర్వాయర్ వరద గేట్లను ఎత్తే రాడ్ వంగిపోయింది. దీంతో ప్రమాదపు అంచున్న గేట్లున్నాయి. ‘సింగితం’ వరద గేట్ల రాడ్లను బాగుతో పాటు గ్రీ సింగ్, ఆయిలింగ్ పనులకు ప్రతిపాదించినా పను లు చేసేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారు.
టెండర్లకు ముందుకు రావడం లేదు
నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గే ట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ ప నుల కోసం మూడోసారి టెండర్లు పిలిచాం. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సోలోమన్,
నీటిపారుదలశాఖ ఈఈ, నిజాంసాగర్
గ్రీసింగ్, ఆయిలింగ్ కరువు
పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
పట్టించుకోని అధికారులు

ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ గాలికి!

ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ గాలికి!