
రైస్‌మిల్లుల తనిఖీ
భిక్కనూరు: మండలంలోని రెండు రైస్‌మిల్లులను జిల్లా వ్యవసాయాధికారి తిరుమలప్రసాద్, డీఎస్‌వో మల్లికార్జున్, పౌరసరఫరాల శాఖ డీఎం రాజేందర్ ఆదివారం తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగవంతంగా ధాన్యం బస్తాలను అన్‌లోడ్ చేయాలని సూచించారు. వారి వెంట తహసీల్దార్ శివప్రసాద్, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ గౌరిశెట్టి సంతోష్ కుమార్ ఉన్నారు. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా వేగంగా కాంటాలు నిర్వహించి, ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపించాలని సూచించారు.
సరిహద్దులో
చెక్‌పోస్ట్ ఏర్పాటు
మద్నూర్: బక్రీద్ నేపథ్యంలో పశువులను తరలించకుండా సలాబత్‌పూర్ వద్ద ఆదివారం పోలీస్ సిబ్బంది చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్రాల నుంచి పశువుల అక్రమ రవాణా జరగకుండా చూసేందుకు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు.
నేడు ఆయిల్‌పాం మొక్కల
మెగా ప్లాంటేషన్
బీబీపేట : యాడారంలో సోమవారం ఆయిల్‌పాం మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ అధికారులు, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
రైతుబంధు నిధులు
విడుదల చేయాలి
● వ్యవసాయశాఖ మంత్రికి ఎన్‌డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి వినతి
సుభాష్‌నగర్: యాసంగి సీజన్‌కు సంబంధించి నాలుగు ఎకరాలపైన రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ప్రభుత్వం యాసంగి సీజన్‌లో నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు నిధు లు జమ చేసిందని, మిగతా రైతులకు త్వ రగా విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో సాంకేతిక కారణాలతో మాఫీ పొందని రైతులకు కూడా రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిధు లు జమ చేసేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు రమేశ్‌రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని మంత్రి సూచించారని పేర్కొన్నారు.
కానిస్టేబుల్‌పై కేసు
నిజామాబాద్ రూరల్: అధిక వడ్డీ వసూలు చేస్తున్న కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరిఫ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరప్రియదర్శిని కాలనీకి చెందిన గంగాధర్ మెండోరా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చి, ఆమెకు చెందిన ఆస్తి పత్రాలను సేల్ డీడ్ చేసుకోవడంతోపాటు ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సేల్‌డీడ్ చేసుకున్న ఆస్తిని గంగాధర్ వేరొకరికి విక్రయించినట్లు తెలుసుకున్న మహిళ.. రూరల్ పోలీసులు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలను తమకు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

రైస్‌మిల్లుల తనిఖీ

రైస్‌మిల్లుల తనిఖీ