
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
బాన్సువాడ రూరల్: విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి అన్నారు. బుధవారం కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగు వేయాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: యువత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో నార్కోటిక్స్ డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమన్వయకర్తలు విశ్వప్రసాద్, అంకం జయప్రకాష్, అధ్యాపకులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి