
సదస్సులో వేదికపై వ్యవసాయ శాస్త్రవేత్తలు
జగిత్యాల అగ్రికల్చర్ : రైతులకు అవసరమైన వ్యవ సాయ పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉత్తర తెలంగాణ జోనల్‌స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండురోజులుగా సాగుతున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యవసా య శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, అభ్యుదయ రైతుల సదస్సు బుధవారం ముగిసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వెంకటరమణ సదస్సుకు అధ్యక్షత వహించారు. పంటల వారీగా 10 బృందాలు ఏర్పాటు చేసి, సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చలు జరిపారు.
ముగిసిన ఉత్తర తెలంగాణ
వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు