జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడి చే నిజామాబాద్‌లోని శిశుగృహ ద్వారా 2011 నుంచి ఇప్పటి వరకు 170 మంది పిల్లలను దత్తత ఇ చ్చారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ రిసోర్స్ అడాప్షన్ అథారిటీ (కార) వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా దత్తత అప్రూవల్ కమిటీ పిల్లలను దత్తత తీసుకునే దంపతుల ఆర్థిక స్థితిగతులు, మెడికల్ ఫిట్నెస్ పరిశీలిస్తుంది. అప్రూవల్ కమిటీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, శిశు గృహ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. అప్రూవల్ కమిటీ సిఫారసు మేరకు పిల్లల దత్తతకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తా రు. ఇటలీ, కెనడా, అమెరికా, జర్మనీ దేశాలకు కూడా పిల్లలను దత్తత ఇచ్చినట్లు నిజామాబాద్ శిశుగృహ అధికారులు తెలిపారు.