
దగ్ధమైన మొక్కజొన్న పంట
మోర్తాడ్:శ్రీరామ నవమి తర్వాత పంట కోసి విక్రయించాలని భావించిన ఆ రైతుకు నిరాశే మిగిలింది. షార్ట్ సర్క్యూట్‌తో చేతికొచ్చిన మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముచ్కూరి గంగానర్సు, తన సమీప బంధువు సహకారంతో మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసింది. ఈ పంట పొలం మధ్య నుంచి 11కేవీ సామర్థ్యంగల విద్యుత్ లైన్ ఉంది. ఆ తీగలకు షార్ట్‌సర్క్యూట్ ఏర్పడటంతో తీగలు తెగి పంట పొలంలో పడ్డాయి. దీంతో మూడు ఎకరాల్లోని మొక్కజొన్న పంటతో పాటు డ్రిప్ కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.

కాలిన డ్రిప్ పైపులను చూపుతున్న రైతు