
పట్టుబడి గంజాయి, నిందితులతో
తహసీల్దార్
శ్రీనివాస్,
ఎస్సై శివనాగబాబు
గోకవరం: రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గోకవరం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్సై యూవీ శివనాగబాబు కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లి శివారు పెద్ద చెరువు వద్ద చాకలిరేవు సమీపాన గంజాయిని తరలించేందుకు పడాల కన్నబాబు (రాజానగరం మండలం నందరాడ), మంగల బాలరాజు (రంపచోడవరం మండలం చిన్నబీరంపల్లి), కొనుతురి కృష్ణ (అడ్డతీగల మండలం భీముడుపాకలు), తడాల నాగ రవితేజ (గోకవరం మండలం కొత్తపల్లి) రెండు వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ సమక్షంలో వారి నుంచి రూ.1.10 లక్షల విలువైన 24 కేజీల గంజాయి, రూ.4,500 నగదు, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించారు.