
ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుచేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగాలకు పీఆర్‌సీ అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటుచేసిన యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి రవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ అమలు గడువు దాటి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం దష్టి సారించడం లేదన్నారు. పీఆర్‌సీ నివేదికలు తెప్పించుకొని 2023 జూలై నుంచి అమలు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి, జిల్లా నాయకులు వీరన్న, శ్రీధర్, రమేష్, రామ్ నాయక్, రామయ్య, రఫీపాషా, అర్జున్, కోడెపాక రమేష్, రాజు పాల్గొన్నారు.