
మెడికల్ కళాశాల పనులు పరిశీలిస్తున్న కలెక్టర్
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభించే నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెంచి మెడికల్ మొదటి సంవత్సర విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణ పనులు వీలైనంత త్వరగా, నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ ఉన్నారు.